ప్రజాసంగ్రామ యాత్ర ను జయప్రదం చేయండి.

తోర్రుర్ 8 ఆగష్టు (జనంసాక్షి) బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర-ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 14,15,16తేదీలలో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతుంది అని బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజాసంగ్రామ యాత్ర నియోజకవర్గ ఇన్చార్జి లేగా రాం మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.తొర్రూరు లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారని తెలిపారు. కేసీఆర్ సర్కారు నియంత్రృత్వ నిరంకుశ అహంకార పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది అని తెలిపారు.రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ పుంజుకుంటుందని అని తెలిపారు.కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లికి బీజేపీ నేతృత్వంలో విముక్తి కాబోతుంది అని తెలిపారు.పాలకుర్తి నియోజకవర్గం లో జరిగే పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు,దుబ్బ రాజశేఖర్, తొర్రూరు రూరల్ మండల అధ్యక్షుడు బొచ్చు సురేష్,పెదవంగర మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన సుధాకర్, జిల్లా ,మండల నాయకులు చింతా స్రృజన్,పైండ్ల రాజేష్,కాగు నవీన్, నూకల నవీన్,మచ్చ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.