Wednesday, 4 November 2026

ఘనంగా నూతన కాబినెట్ ప్రమాణ స్వీకారం

  లయన్ డాక్టర్ బి విజయ రంగ
 ఎల్బీ నగర్ (జనం సాక్షి )  ప్రపంచము లో అతి పెద్ద  ఎన్జి ఓ సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్ .ప్రపంచ వ్యాప్తంగా సేవ చేస్తున్న సంస్థ ప్రజలకు అనేక సేవ కార్యక్రమాల్లో భాగంగా  జిల్లా 320-D ఇన్స్టలేషన్ హైదరాబాద్ విశ్వనాధ్ గార్డెన్స్ లో ఘనంగా నూతన కాబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది .జిల్లా గవర్నర్ గ లయన్ గంధాని శ్రీనివాస్    ఎల్ సి ఐ ఎఫ్ లీడర్  ఘట్టమనేని బాబురావు  ఒక చక్కటి సేవ కార్యక్రమము ను ఉచితముగ మరు మూల ప్రాంతములలో పేద గిరిజన విద్యార్థులకు ఉచితముగా 60 సైకిళ్ళు ,పీద రైతులకు పిచికారీ చెయ్యటానికి స్ప్రే డబ్బాలు100 , హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థులకు బెడ్స్ 100 జిల్లాలోని లయన్ లీడర్స్ తో ప్రారంభించారు .ఈ కార్యక్రమములో లయన్స్ క్లబ్ కొత్తపేట నుండి అధ్యక్షులు లయన్ డాక్టర్ బి విజయ రంగ ,లయన్ సైకం రేణుక రెడ్డి ,లయన్ పద్మావతి ,లయన్ శ్రీనివాస్ రావు ,లయన్ కోలా శ్రీనివాస్ మరియు లయన్ కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.సేవ చెయ్యాలని అందులో నిజముగా అవసరమున్న వారికి మాత్రమే చెయ్యాలని లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కొత్తపేట కూడా ఎల్ బి నగర్ , పరిసర ప్రాంతాలలో గత 8 సంవత్సరాలలో అనేక మెడికల్ క్యావిలిన్స్ ఉచిత కంటి ఆపరేషన్లు మహిళలకి కుట్టు మెషిన్ శిక్షణ శిబిరాలు  ,పర్యావరణ సంరక్షణలో భాగంగా చెట్లు నాటుతు అవగాహన సదస్సులు సొంతముగా ప్రభుత్వ సహాయము లేకుండా వరదలు , కోవిడ్ సమయములో గ్రోసరీస్ పంచుతు తమవంతు సహాయము అందిస్తున్నామని లయన్ డాక్టర్ బి విజయ రంగ తెలియపరిచారు .