ఘనంగా పండుగొల సాయన్న జయంతి వేడుకలు.

పేదల కోసం పోరాడిన గొప్ప యోధుడు పండుగ సాయన్న..
మక్తల్ ఆగస్టు 08 (జనంసాక్షి) మక్తల్ మండలం లో పండుగల సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ధనవంతులతో పోరాడి పేదలకు సాయం చేసిన తెలంగాణ రాబిన్ హుడ్ ను స్మరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. పండుగ సాయన్న వారసులకు అన్ని విధాల అండగా ఉంటామని పండుగ సాయన్న ఖ్యాతిని మరింతగా పెంచే బాధ్యత తమపై ఉందని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగల సాయన్న జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మామిళ్ల పృథ్వీరాజ్, యాదగిరి, నవీన్, పీకే నరసింహ, వాకిటి రమేష్, ఆనంపల్లి రమేష్, అభి, సంతోష్, రాజు, వాకిటి ఆనంద్, వాకిటిశేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.