జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం అభినందనీయం
– కేజీకేఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08 : ఈనెల 18న సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతామని ప్రకటించడం అభినందనీయమని కెజీకేఎస్ సోషల్ మీడియా సిద్దిపేట జిల్లా కన్వీనర్ మేరిండ్ల (తురాయి) శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈసందర్భంగా సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తామని మెమో జారీ చేసిందని, కల్లుగీత కార్మిక సంఘం అభ్యర్థనను వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, తదితర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం స్పందించి 18వ తేదీన ఉత్సవాలను అధికారికంగా జరుపుతామని ప్రకటించడం పట్ల కల్లు గీత కార్మిక సంఘం తరపున హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో సంఘం తరపున ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.