బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కట్కూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో  బుధవారం పట్టణంలో జాతీయ జెండాలను చేతబూని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం నిజాం పాలన నుండి విముక్తి కలిగి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చిందన్నారు.ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారని గుర్తు చేశారు.ఎంఐఎంకు భయపడి చరిత్రను వక్రీకరిస్తూ జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రకటిస్తున్నారని,ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమేనని అన్నారు.‌భవిష్యత్ తరాలకు తెలిసేలా తెలంగాణ స్వాతంత్ర్య పోరాటాన్ని  పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు.ఈ నెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా పట్టణ అధ్యక్షులు దోసకాయల ఫణి నాయుడు, పట్టణ అధ్యక్షులు ఎండీ. అబీద్,  జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర , జిల్లా ఉపాధ్యక్షులు  గజ్జల వెంకట్ రెడ్డి, చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి పల్సా మల్సూర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు పందిరి రాంరెడ్డి , వెన్న శశిధర్ రెడ్డి, పోకల రాములు, పేర్వాల లక్ష్మణరావు , దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వల్దాస్ ఉపేందర్, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు మీర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.