ఘనంగా బతుకమ్మ,దసరా ఉత్సవాలు..

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి)
శివనగర్ బతుకమ్మ,దసరా ఉత్సవ కమిటి అద్యక్షుడు మర్రి శ్రీనివాస్ ఆద్వర్యంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ , కార్పోరేటర్లు దిడ్డి కుమారస్వామి,సోమిశెట్టి ప్రవీణ్ లు శివనగర్ బతుకమ్మ,దసరా  ఉత్సవాల గురించి శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు..
మూడు డివిజన్ల పరిదిలోని బతుకమ్మ,దసరా ఉత్సవాలు శివనగర్ బతుకమ్మ,దసరా ఉత్సవ కమిటి ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామని,తగిన ఏర్పాట్లు చేసేలా అదికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు..దసరా,బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని,తానూ స్వయంగా బాగస్వామిని అవుతానని ఎమ్మెల్యే వారికి తెలిపారు..
ఈ కార్యక్రమంలో అనుముల నగేష్,పొలెపాక నరేందర్,అనీల్,స్వామి,బాలరాజు,శ్యామ్,యాదగిరి,శ్రీనివాస్,వేణు,ప్రభాకర్,సుదాకర్,కుమార్,కుడికల సుదాకర్,గడ్డం శ్రీనివాస్,రాజు,సురేందర్,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు..
Attachments area