ఘనంగా బాలోత్సవ్‌ వేడుకలు ప్రారంభం

ఖమ్మం : 21వ రాష్ట్ర స్థాయి అంతర్‌ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా బాలోత్సవ్‌ వేడుకలు ఖమ్మం కోత్తగూడెం క్లబ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గోనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. కడపకు చెందిన బదీర విద్యార్థి గానిశెట్టి వెంకట్‌తో పతాక అవిష్కరణ చేసివేడుకలను ప్రారంభించారు.