హైదరాబాద్: మజ్లిన్ ఇత్తేహాదుల్ ముస్లిమాన్ (ఎంఐఎం) పార్టీ 55వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో పార్టీ పతాకాన్ని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గోన్నారు.




