పెన్ పహడ్.మార్చి 06 (జనం సాక్షి):
మండల పరిధిలోని అన్నారం బ్రిడ్జి గ్రామంలో ఆదివారం గ్రామశాఖ అధ్యక్షుడు మీసాల లింగయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కెసిఆర్ మహిళ బందసంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా అంగన్వాడి , ఆశా కార్యకర్తలు , ఏఎన్ఎంలు , , సమభావన సంఘాల మహిళలకు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి విశేషంగా సేవలందిస్తున్న మహిళా మణులందరికీ గౌరవించడం మన తెలంగాణ సంప్రదాయమని అన్నారు మహిళా బంధు వేడుకలలో మాజీ సర్పంచ్ మీసాల లచ్చయ్య ,మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎగ్గడి మురళీ మనోహర్ ,ముదిగొండ వీరస్వామి , రంగయ్య, నరేందర్, యాకూబ్ ,చారి పాల్గొన్నారు.




