Tuesday, 3 November 2026

మహిళ వైద్య సిబ్బందికి ఘనంగా సన్మానం

జనం సాక్షి న్యూస్ మార్చ్ 6/ వలిగొండ; మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మచ్చగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి సొంత నిధులతో మహిళ వైద్య సిబ్బందికి పట్టుచీర పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారని,వైద్య సిబ్బంది కరోనా కాలంలో కూడా భయం లేకుండా ప్రజలకు సేవలు అందజేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడ లక్ష్మమ్మ బాలయ్య,మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కొనపురి కవిత,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దెల మంజుల,మండల రైతు కోఆర్డినేటర్ పడమటి మమత,పిఎసిఎస్ చైర్మన్ చిట్టెడి వెంకట రామిరెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి,నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్,డేగల పాండు,ఎలిమినేటి సత్యనారాయణ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎం ఏ  లింగస్వామి ,కెసిరెడ్డి జనార్దన్ రెడ్డి,ఆకుల వెంకన్న,యం రమేష్,వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.