ఘనంగా మాజీమంత్రి ఆర్డీఆర్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): మాజీ మంత్రి , టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బారి కేక్ ను డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ పలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన మహా నాయకుడని కొనియాడారు.అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.