ఘనంగా మాజీ ఎమ్మెల్యే తనయుడు జన్మదిన వేడుకలు

మహబుబ్ నగర్ ఆర్ సి ,అక్టోబర్ 7 ( జనంసాక్షి )  పరిగి మాజీ ఎమ్మెల్యే ,వికారాబాద్ జిల్లా కాంగెస్ పార్టి అద్యక్షులు  డా .రామ్మోహన్ రెడ్డి తనయుడు డాక్టర్ రితిక్ రెడ్డి  జన్మదిన వేడుకలకు  గండీడ్ మండల  కాంగ్రెస్ నాయకులు ,కార్యాకర్తలు హాజరై రితిక్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా రితిక్ రెడ్డి  కేక్‌ కట్‌ చేశారు. శుక్రవారం పరిగిలోని మాజీ  ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని కార్యకర్తలు , నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన పార్టి కార్యకర్తలు , నాయకులు  ఎమ్మెల్యే తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకట్ యదవ్ ,మంగంపేట నరసింహ రెడ్డి ,హన్నన్ షరీప్,గండీడ్ ,మహమ్మదాబాద్ మండలాల నాయకులు ,కార్యాకర్తలు  తదితరులు పాల్గొన్నారు .