మహాసభ విజయవంతం చేయాలి…

 

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 7
ఏఐటిసి జిల్లా మహాసభ ను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ శంకరపట్నం మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య శుక్రవారం పిలుపునిచ్చారు. ఏఐటీసీ కరీంనగర్ జిల్లా 7 వ మహాసభ అక్టోబర్ 22న కరీంనగర్ పట్టణంలోని ఎదురుగా గల రెవెన్యూ గార్డెన్ నిర్వహించడం జరుగుతుందని మహాసభకు మండలంలోని అన్ని గ్రామాల్లోని మేధావులు, విద్యావేత్తలు, కార్మికులు, కర్షకులు ,హమాలీ కార్మికులు ఆటో కార్మికులు తాపీ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి మండల అధ్యక్షుడు ఎండి బాదుల్లా, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి కన్నం సదానందం, వెంకటస్వామి, పరమేష్, రవి, సంపత్, జాన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.