ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

– నివాళులర్పించిన సర్పంచ్ లక్ష్మి ఆనంద్
కుల్కచర్ల,ఆగస్టు 20(జనం సాక్షి):
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మి ఆనంద్ మాట్లాడుతూ..దివంగత నేత రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన సేవలు మర్చిపోలేమన్నారు.భారత దేశ పంచాయతీ వ్యవస్థను,టెలికం రంగాన్ని ఆయనే తీసుకురావడం జరిగిందన్నారు.ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాలకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.రాజీవ్ గాంధీ ఆశలను కొనసాగించాలంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సందని నర్సింలు, గ్రామ కో ఆప్షన్ సభ్యులు మహమూద్ అలీ, సీనియర్ నాయకులు సయ్యద్ అంజద్ హుస్సేన్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్,చిట్యాల వెంకటయ్య,బాలకిష్టయ్య, జిల్లాల చంద్రయ్య, తులసి నాయక్, ప్రైమరీ స్కూల్ చైర్మన్ తలారి నర్సింలు, గ్రామ అధ్యక్షులు షర్పోద్దిన్, కార్యదర్శి బీమ్ భాస్కర్, బాలరాజు,ఉప్పరి చెన్నయ్య,కిన్నరి కిష్టయ్య, పి అశోక్, కటిక నన్నోజి, హరిచంద్ర నాయక్, సారా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.