ఘనంగా ముఖ్యమంత్రి కేసీఅర్ జన్మదిన వేడుకలుఘనంగా ముఖ్యమంత్రి కేసీఅర్ జన్మదిన వేడుకలు
కొడకండ్ల,ఫిబ్రవరి17( జనంసాక్షి) కొడకండ్ల మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ప్రధానకార్యదర్శి కైరోజు సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని సాధించుకున్న రాష్ట్రం లో మన ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలో మరింత అభివృద్ధిని సాధించుకున్నామని.భారత దేశం లో ఎక్కడ లేని పథకాలు మన రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఅర్ అమలు చేశారని.రాష్ట్రంలో మార్పు మన కళ్ళ ముందే ఉందని,రాష్ట్రం లో వచ్చిన మార్పు దేశమంతటా రావాలని ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఅర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీసులతో దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారనీ.ముఖ్యమంత్రి కేసీఅర్ ఇలాంటి అద్భుతమైన జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పేరం రాము,సర్పంచ్ పసునూరి మధుసూదన్, మండల ఉపాధ్యక్షుడు యం డి ఆసీఫ్,పట్టణ అధ్యక్షుడు మసూరం వెంకట్ నారాయణ, ఏ యం సి డైరెక్టర్ కుందురు అమరేందర్ రెడ్డి , సోమేశ్వర రావు,ఎఫ్ ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ మేటి సోమరములు, మండల కో ఆప్షన్ సభ్యులు Md నజీర్,సీనియర్ నాయకులు బాకి ప్రేమకుమార్, చెంచు రాజిరెడ్డి,వీరారెడ్డి నారాయణ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్,ఎస్ సి సెల్ అధ్యక్షుడు రామస్వామి,ఎస్ టి సెల్ అధ్యక్షుడు మగ్య నాయిక్, మండల యూత్ అధ్యక్షుడు దేశగాని సతీష్,వివిధ గ్రామాల సర్పంచ్ లు, రాములు నాయిక్, మోహన్ నాయిక్, ఎంపీటీసీ లు, గ్రామపార్టీ అధ్యక్షులు కార్యదర్శి లు పట్టణ ఉప్పసర్పచ్ బోయిని రమేష్, బాబర్,గ్రామా Sc సెల్ అధ్యక్షుడు అందే మల్లేష్,ఎల్లయ్య, శోభన్ గౌడ్, వార్డుమేబర్స్, పార్టి ముఖ్య నాయకులు,యూత్ నాయకుల తదితరులు పాల్గొన్నారు