ఘనంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన వేడుకలు.

బెజ్జంకి,అక్టోబర్10,(జనంసాక్షి): మండల కేంద్రంలోని యువజన నాయకులు,యువకులు అంతా కలిసి సోమవారం మండల ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన పురస్కరించుకొని గాగిల్లాపూర్ లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు,పండ్లు మరియు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల లోని పిల్లలకు నోట్ బుక్స్,పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేశారు.మండల కేంద్రంలో యువకులకు దిశా నిర్దేశం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతిభద్రతలను కాపాడుతున్న ఎస్సై ఆవుల తిరుపతి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉందని యువజన నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు,యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.