బషీరాబాద్ ఆగస్టు 12, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో భారత స్వాతంత్ర వజ్రోత్స వాలలో భాగంగా శుక్రవారం రోజున కేసీఆర్ చిత్ర పటానికి రాఖీ కటి ఘనంగా రాఖీ పండుగను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో రేణుక మరియు విద్యార్థులు ఉమాదేవి తదితరులు దేశ భక్తి గెయాలను పాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ ఏనాడు లేనివిధాగా రాఖీ పౌర్ణమి రోజున అన్న ధముడ్లు,అక్క చేలెండ్లు కలిసి పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 8వ తేదీ నుండి 22 తేదీ వరకు భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు రాష్ట్రం అంతటా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమేష్, ఎస్.ఐ అన్వేష్ రెడ్డి,ఇంచార్జ్ సర్పంచ్ పార్వీన్ బేగం,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,కోఅప్షన్ మెంబర్ అబ్దుల్ రాజాక్,అధికారులు,ఆశావర్కర్లు, గ్రామ యువకులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.




