*ఘనంగా రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలు*

పెద్దేముల్ ఆగస్టు 20 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల కేంద్రంలో శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి, టిపిసిసి మైనార్టీ డిపార్ట్మెంట్ కన్వీనర్ రియాజ్, పెద్దేముల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్ లు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు.కేంద్రం నుండి నేరుగా పంచాయతీలకు నిధులు వస్తున్నాయంటే దానికి కారణం రాజీవ్ గాంధీ అని తెలిపారు.దేశంలో ప్రజలకు రేషన్,ఉపాధి,మౌలిక వసతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్, బోయిని అంజిలయ్య, రామ్ సింగ్ నాయక్, సురేష్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.