ఘనంగా రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ వార్షికోత్సవ వేడుకలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ అన్నారు.బుధవారం స్థానిక 60 ఫీట్ల రోడ్డులో ఆ సంఘ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మనకు స్వాతంత్రం తీసుకువచ్చారని అన్నారు.స్వాతంత్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కొరకు పోరాటం చేస్తూ, విద్యార్థి క్షేత్రంలో విద్యారంగ సమస్యలపై, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు.విద్యార్థులకు ఎల్లవేళలా తమ సంఘం అందుబాటులో ఉంటుందన్నారు.విద్యా రంగ సమస్యల పరిష్కారానికై పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చామకూరి మహేందర్, జిల్లా కార్యదర్శి సాయి, పట్టణ అధ్యక్షులు ధరావత్ దినేష్ , ఈశ్వర్ , సాయి , మహేష్ , బంటి, అఖిల్ , గోపి , రాము , వాసు , నవీన్ తదితరులు పాల్గొన్నార