ఏఐటీయూసీ పోరాటాలతోనే కార్మికుల సమస్యల పరిష్కారం
-రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ
రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లోని ఆర్కే వన్ ఏ గని ఆవరణలో సింగరేణి కాలేరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి యం.డి అక్బర్ అలీ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ సింగరేణి లో నూట తొంభై మస్టర్లు నిండిన బదిలీ వర్కర్ లకి ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే జనరల్ మజ్దూర్ లు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. అలాగే గోదావరిఖనిలో ఉన్న సింగరేణి కార్మికుల సి. ఎం. పి. ఎఫ్. కార్యాలయాన్ని హైదరాబాద్ కి తరలించడాన్ని ఏఐటీయూసీ వ్యతిరేకించడం వలన మళ్ళీ
సి ఎం పి ఎఫ్ కార్యాలయాన్ని గోదావరిఖని లోనే సాగిస్తున్నారని తెలిపారు. సోకార్మికుల హక్కుల సాధన, హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుంటే, సింగరేణి లో గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసినప్పటికి, ఇంకా గుర్తింపు సంఘంగా కొనసాగుతున్నటువంటి టి. బి. జి. కే. ఎస్. కేవలం పైరవీలకే ప్రాధాన్యత ఇచ్చి, కార్మిక సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సింగరేణి లో ఎన్నడూ లేని విధంగా మితిమిరిన రాజకీయ జోక్యం వలన సింగరేణి సంస్థ మళ్ళీ బి. ఐ. ఎఫ్. ఆర్. కి పోయే పరిస్థితి కనబడుతున్నదని కార్మికులకు మరోసారి గుర్తు చేశారు. అదే విధంగా సింగరేణి యాజమాన్యం లాభాల వాటా వెంటనే ప్రకటించి కార్మికులకు అందజేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బ్రాంచి ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, గని ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సురమళ్ళ వినయ్ కుమార్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గోవిందుల రమేష్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ సళ్ళ సంతోష్ కుమార్, ఏఐటీయూసీ ఫిట్ కమిటీ సభ్యులు సుంకరి గట్టయ్య, కారపాక లక్ష్మయ్య, కోమటిపెల్లి సత్తయ్య, సిలివేరు హరీష్, శంకర్, మంద శివ, శ్రీనివాస్, బండ కట్టు వెంకటేష్, సిద్ధం హరికృష్ణ, దుగుట హనుమయ్య, సురేష్, ఏఐటీయూసీ కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.