Wednesday, 4 November 2026

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

పెన్ పహాడ్, జూన్ 03 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రైతు దినోత్సవంను మండలంలోని పెన్ పహాడ్ రైతు వేదిక , పాటు అనాజిపురం, నాగులపాటి, అన్నారం, ధూపహాడ్ ,చీదేళ్ల రైతు వేదికల్లో శనివారం ఘనంగా ర్యాలీలు నిర్వహించి ఉత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎంపీపీ నెమ్మాది బిక్షం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం రైతుబంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్, వ్యవసాయానికి సాగునీరు, వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతన్నల అభివృద్ధికి చేసింది అన్నారు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి గురించి, పథకాల గురించి రైతులకు వివరించారు. మీటింగ్ అనంతరం రైతులతో సహా పంక్తి భోజనాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మండల స్పెషల్ ఆఫీసర్ రాOపతి, తహసీల్దార్ శేషగిరిరావు, మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ఇన్చార్జి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, ఏ ఈ లుపిడమర్తి లింగయ్య, గోపి,విత్తన ధ్రువీకరణ అధికారి కిషోర్, డిప్యూటీ తాసిల్దార్ బి. పద్మ , ఆర్ ఐ స్వప్న, మట్టయ్య, ఏ ఈ ఓ లు సంధ్య, మనోజ్ ,గోపి , సుష్మ, సీఈవో సోముల నాయక్, నాయకులు తూముల ఇంద్రసేనారావు ,నాగార్జున్, దండంపల్లి దేవేందర్ , ఒగ్గు గోపి, ఆయా గ్రామాల సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు…