ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
వైయస్సార్ తెలంగాణ పార్టీకి మంచి స్పందన ఉంది రానున్న రోజుల్లో తెలంగాణ లో వైయస్సార్ తెలంగాణ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ సంగారెడ్డి అసెంబ్లీ కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి గారి సాయినాథ్ రెడ్డి
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జులై 8
వైయస్సార్ తెలంగాణ పార్టీకి మంచి స్పందన ఉందిరానున్న రోజుల్లో తెలంగాణ లో వైయస్సార్ తెలంగాణ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ సంగారెడ్డి అసెంబ్లీ కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి గారి సాయినాథ్ రెడ్డి అన్నారు.సంగారెడ్డి నియోజకవర్గం లోని కంది మండల పరిధిలోని ఆరట్ల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ ఆధ్వర్యంలో శనివారం స్థానిక వైయస్సార్ విగ్రహానికి పాలభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జోహార్ వైయస్సార్ అంటూ నిదానాలు చేశారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ సంగారెడ్డి అసెంబ్లీ కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి గారి సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ తెలంగాణ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, రానున్న రోజుల్లో పార్టీకి ఓటు వేసి పట్టం కట్టడం ఖాయమన్నారు. వైయస్సార్ హయాంలో ప్రతి పౌరునికి మేలు జరిగిందన్నారు. తాము ఎల్లవేళలా పార్టీ గురించి పనిచేస్తున్నామని రానున్న రోజుల్లో తమ సత్తా ఏదో చూపుతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కళ్యాణి బాబు గౌడ్జి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆనంద్ గౌడ్జి, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ సతీష్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి. రంగల్ల రమేష్జహీరాబాద్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు మంథూర్ దత్తారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ నరేష్జ గదీష్ సూర్యకాంత్జ,అజయ్షే, అభిషేక్, బన్నీ చంద్రశేఖర్, ఎల్లయ్య, మోజయత్ ,మచేందర్, మైపాల్,తదితరులు పాల్గొన్నారు