ఘనంగా శివ పార్వతుల రథోత్సవం

జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 20
శ్రీ.రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవం
పెంట్లవెల్లి మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవ వేడుకలో పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పల్లె నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవ ఊరేగింపు అంగ రంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది.స్వామి వారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం భక్తులతో కలిసి రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవ ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి కరుణ కటాక్షాలు,చల్లని చూపులు దివేనలతో ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గౌరవ ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రథదాత పల్లె నాగరాజు ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అనుచర వర్గం మాజీ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి
మాచినేనిపల్లి సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాసులు కొల్లాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ హుజూర్ శ్రీనివాసులు యాదవ్ బిఆర్ఎస్ నాయకులు సురేందర్ మాజీ సర్పంచ్ రాజేష్ మాజీ మార్కెట్ చైర్మన్ వీరయ్య వెంకటస్వామి ప్రజాప్రతినిధులు,భక్తులు బిఆర్ఎస్ నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.