Wednesday, 4 November 2026

ఘనంగా శ్రీవాల్మీకి మహర్షి జయంతి

రాయికోడ్  జనం సాక్షి  09రాయికోడ్  మండలకేంద్రమైన రాయికోడ్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పవిత్ర గ్రంథం రామాయణాన్ని రచించిన శ్రీవాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం అర్చకులు సంజీవ్ జోషి చే అభిషేకం, పూజాకార్యక్రమాలు నిర్వహించి శ్రీవాల్మీకి
మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు,అనంతరం అర్చకులు సంఘం సభ్యులకు, గ్రామస్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు,అలాగే కుస్నుర్ గ్రామంలో కూడా శ్రీవాల్మీకిమహర్షి చిత్రపటానికి పూజాకార్యక్రమం నిర్వహించి జయంతిని ఘనంగా నిర్వహించారు.
Attachments area