ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
జనం సాక్షి, వంగూర్:
మండల కేంద్రంలో శ్రీ గెల్వలాంబ మాత ఆలయం ఆవరణలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. తదుపరి శ్రీకృష్ణుడికి పూజలు, అభిషేక అర్చనలు చేసి చిన్నారులకు కృష్ణుడు, రాధా గోపిక ల వేషధారణలతో సందడి చేశారు. వేడుకలలో చిన్న పెద్ద తేడా లేకుండా యాదవుల చేత ఉట్లు కొట్టడం జరిపారు. గౌతమ్ తేజ, కన్నయ్య, శ్రీనిత్, అనీష్క, రసజ్ఞ, అభిజ్ఞ కృష్ణుడు , రాధా గోపికల వేషాదరణలో ఉన్న చిన్నారులకు శ్రీ గెల్వ లాంబ మాత గుడి చైర్మన్ వెంకటస్వామి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్కి లావణ్య ఎల్ల గౌడ్, గుడి చైర్మన్ వెంకటస్వామి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
