ప్రెస్ మీట్ కు అనుమతి లేదు
– పెద్దపల్లి డిసిపి రూపేష్
మంథని ఆగస్ట్ 20, (జనంసాక్షి):- పెద్దపల్లి జిల్లా మంథని ప్రధాన చౌరస్తాలో ప్రెస్ మీట్ కు అనుమతి లేదని పెద్దపల్లి డిసీపీ రూపేష్ తెలిపారు. శనివారం పాత్రికేయులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరిస్తూ గత రెండు రోజులుగా మంథని పట్టణంలో గత మూడు రోజుల నుండి అంబేద్కర్ చౌరస్తాను వేదిక గా చేసుకొని రెండు ప్రధాన పార్టీలు ప్రజాశాంతి కి భంగం కలిగించే విధంగా, రెండు వర్గాల్లో వైషమ్యాలు రేకేత్తిoచే విధంగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు, అదే విధంగా రేపు ఉదయం కూడా ఈ రెండు ప్రధాన పార్టీలు చర్చకు ఉపక్రమించారు అనే సమాచారం మేరకు శాంతి భద్రతల దృష్ట్యా అక్కడికి ఎవరిని అనుమతించడం లేదు, ఎవరైనా అంబేద్కర్ చౌరస్తా లో ప్రెస్ మీట్ కానీ, మరేదైనా కార్యక్రమం కానీ చేస్తే సంబంధిత వ్యక్తులపై తగిన చర్య తీసుకోబడును మరియు అట్టి వ్యక్తులను సతప్రవర్తన కొరకై సెక్షన్ 107,109 Cr.P.C క్రింద బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుందని, అన్ని పార్టీల వారు పోలీసులకు సహకరించాలి , శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.