*ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు.
చిట్యాల 22(జనంసాక్షి) మండలంలోని నవాబ్ పేట గ్రామంలో దళిత శక్తి గ్రామ అధ్యక్షులు పర్లపల్లి కుమార్ మహారాజ్ ఆధ్వర్యంలో సోమవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవాలు ఈనెల 18 నుండి 25 వరకు వారం రోజులపాటు జయంతి వారోత్సవాలలో భాగంగా నిర్వహించారు. అనంతరం జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షులు బొమ్మ శంకర్ గౌడ్ ,డిఎస్ పి జిల్లా కోశాధికారి పుల్ల అశోక్ మహరాజ్ మాట్లాడుతూ 16వ శతాబ్దంలోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక అసమాన తల పైన ఆనాడు అణచివేతకు గురైన సబ్బండ కులాలను ఏకం చేసాడు. ఆనాటి మొగలాయిలను నిజాములను భూస్వామ్య పెత్తందారులను ఎదిరించి పోరాడి 12000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని స్వరాజ్య స్థాపనకు పోరాటం చేసిన బహుజన యోధుడు , వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డ, డిఎస్ పి మండల అధ్యక్షుడు శీల పాక నాగరాజ్ మహరాజ్,ఉపాధ్యక్షుడు నెరెళ్ళ రమేష్ మహరాజ్, కార్యదర్శి మట్టే వాడ కుమార్ మహరాజ్,గ్రామ కోశాధికారి మట్టే వాడ రాజు కుమార్ మహరాజ్ , ప్రధాన కార్యదర్శి చిలుముల రాజు మహరాజ్, చిలుములు శశి మహరాజ్, జీడి సురేశ్ మహరాజ్, మాజీ ఎంపీటీసీ పర్లపెల్లి ఓదెలు, నెరెళ్ల సమ్మయ్య మహరాజ్, గ్రామ గౌడ అధ్యక్షుడు కాసగోని సాంబయ్య గౌడ్ , గోపగాని మహేష్ గౌడ్ , గోపగని స్వామి గౌడ్, మోతుకురి సమ్మయ్య ముదిరాజ్,చెక్క రవి ముదిరాజ్, కత్తెర శాల రాజయ్య రజక, పుసుపు రాజయ్య ముదిరాజ్, బొమ్మ శివలింగు గౌడ్,చింతనిపుల భాస్కర్,వారాల రాజయ్య,కాసగాని మల్లయ్య గౌడ్ తీగల లచ్చినర్స్ ముదిరాజ్,పొన్నం నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.