ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు

టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 18 టేక్మాల్ మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహానీయుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన వర్గాల అభ్యున్నతి కోసం వీరోచిత పోరాటం చేసిన గొప్ప ధీరుడు బహుజన చక్రవర్తి శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. దోపిడిదారులను అంతమొందించి దొరల పెత్తందారుల ఆధిపత్యాలకు చరమగీతం పాడిన మహాత్ముడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టేక్మాల్ పట్టణ గౌడ సంఘం నాయకులు మనోహర్ గౌడ్,కోటగిరి భూమ గౌడ్, మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్,నవ్య భారతి యువజన సంఘం అధ్యక్షుడు భాస్కర్,అందోల్ నియోజకవర్గ యువజన సంఘాల కన్వీనర్ సంగమేశ్వర్ గౌడ్, మండల పరిధిలోని వివిధ గ్రామాల గౌడ సంఘం నాయకులు అనిల్ గౌడ్, సత్యం గౌడ్, తుకారాం గౌడ్, రాజేష్ గౌడ్,అంజగౌడ్,రాజేశ్వర్ గౌడ్, సందీప్ గౌడ్, మల్లేష్ గౌడ్,రమేష్ గౌడ్,శివగౌడ్, సంతోష్ గౌడ్,నాగరాజు గౌడ్,మురళి గౌడ్,విట్ఠల్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రమేష్ గౌడ్,వెంకట్ గౌడ్, నగేష్ గౌడ్, బహుజన నాయకులు భక్తుల కీషోర్,సత్యం, నరేందర్,సంగయ్య,శివ తదితరులు పాల్గొన్నారు.