Wednesday, 4 November 2026

ఘనంగా సామూహిక కోటి కుంకుమార్చన

కూకట్ పల్లి (జనంసాక్షి ):కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా 909 మంది స్త్రీలచే సామూహిక కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామకృష్ణాచార్యులు మాట్లాడుతూ దేవాలయ పాలకమండలి సభ్యులు మరియు భక్తుల సహకారంతో గత 16 సంవత్సరాలుగా దేవాలయంలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం రోజున  సామూహిక కోటి కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక కోటి కుమార్చన నిర్వహించామని. కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలకు ప్రముఖ సిద్ధ వైద్య డాక్టర్ సింధుజ సహకారంతో చీరలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండల సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.