Wednesday, 4 November 2026

ఫోటో రైటప్: సమ్మె చేస్తున్న వీఆర్ఏలు

విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 27, ( జనం సాక్షి ):   సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం విఆర్ఏల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని
వీఆర్ఏల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలెపు శ్రీనివాస్, ఎలిశాల రాము అన్నారు.విఆర్ ఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 34 వ రోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పాలెపు శ్రీనివాస్, ఎలిశాల రాము మాట్లాడుతూ వీఆర్ఏల సమస్య లపరిష్కారంకొరకు గత34రోజులుగా దీక్షలుచేస్తు న్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వంస్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 23వేల మంది వీఆర్ఏ కుటుంబాలు నిరుపేదలని తక్షణం వీఆర్ఏలకు రావలసిన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పేస్కేలు జీవోను అమలు చేయాల ని, అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలని 55 సంవత్సరాలు నిండిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వెంటనే వీఆర్ఏల సమస్య లను పరిష్కారం చేయాలని కోరారు.ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి తక్షణమే హామీలు అమలు చేయాలని అన్నారు.ఈ సమ్మె కార్యక్ర మంలో వీఆర్ఏల మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఎలిశాల రాము, రమ్య జ్యోతి, శివ, సరోజ,రాజేశ్వరి,యాదేశ్,అభి,రాజు, రాజు కుమార్, యాకయ్య, కనకయ్య, పోతరాజు, నీల రాజు తదితరులు పాల్గొన్నారు.