దౌల్తాబాద్ ఆగష్టు 22, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 75 వసంతాల స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు . కళాశాలలో నిర్వహించిన ఆటపాటల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల నుండి జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్ లో ప్రథమ బహుమతి పొందిన సాత్వికను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మంగ్తా, నగేష్,నాగేశ్వరరావు,పవన్ కుమార్,భాగ్యమ్మ, లక్ష్మీనారాయణ, స్వామి, కలశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.




