Tuesday, 3 November 2026

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ మార్చి 4
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
పెంట్లవెల్లి: మండల పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు విజయేంద్ర సింగ్,మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థుల కు పాఠాలు బోధించారన్నారు. అనంతరం ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకున్నారని తెలిపారు మా పాఠశాలలో జరుపుకున్న ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీసేందుకు, స్వీయ వ్యక్తీకరణకు, వారికి ఒక దిశా నిర్దేశాన్ని సూచించే ఆశయాలుగా తోడ్పడుతాయని, ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని మరిన్ని కార్యక్రమాలు మేము నిర్వహించుకుంటామని, అలాగే మా పాఠశాల విద్యార్థులు విద్యతోపాటు, ఆటల్లో అన్నిట్లో మొదటి స్థానంలో ఉన్నారని విద్యార్థుల కోసం ఉపాధ్యాయులందరూ చక్కటి విద్యను అందిస్తున్నారని, ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో
ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.