బడిపంతులు అయిన వేళ
పెద్దవంగర మర్చి 16(జనం సాక్షి ) సాయం పరిపాలన దినోత్సవం ఘనంగా గురువారం మండలంలోని రామచంద్ర తండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి చక్కటి బోధన చేశారు. ఎంఈఓ గా దీవెన ప్రధానోపాధ్యాయులుగా వర్ష, ఉపాధ్యాయులుగా రిషిత ఐశ్వర్య,చరణ్,యశ్వంత్ వారేశ్వర్, వ్యవహరించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం వెంకన్న ,మాట్లాడుతూ నేటి బాల రేపటి పౌరులు విద్యార్థులు చిన్నతనం నుండి కష్టపడి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు అభినందనలు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పాఠశాలకు అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి అభినందనలు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చిక్కాల సతీష్ , ఉపాధ్యాయులు గుర్రం శేఖర్, సిబ్బంది వెంకన్న, విద్యార్థులు పాల్గొన్నారు
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు బడి పిల్లలే




