*ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*
*ఫొటో రైట్ అప్.జాతీయ జెండాను ఎగురవేస్తున్న పద్మశాలి సంఘం అధ్యక్షుడు పుల్లారావు*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేరేడుచర్ల పద్మశాలి సంఘం అధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్బంగా పద్మశాలి సంఘ నాయకులు మహనీయుల చిత్రా పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఛైర్మెన్, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మార్కండేయ, మూషం నరసింహ,మండల మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహ, బాలేన సైదులు,నక్క రామచంద్రయ్య,మండల ప్రధాన కార్యదర్శి యారమద గిరి, కోశాధికారి రెబ్బ రమేష్, ఉపాధ్యక్షులు నక్క గిరి,ఆర్గనైజ్ సెక్రెటరీ రావిరాల యుగంధర్, సంఘ నాయకులు కొంగరి శ్రీను, అక్కలదేవి రవి, నక్క శ్రీను, చిట్టిపొలు శ్రీను,రెబ్బ సత్య నారాయణ,చిట్టిపోలు ఉపేందర్, బాలేన నరసింహరావు,యారమద చంద్రమౌళి,విప్ప నాగరాజు తదితరులు పాల్గొన్నారు..