వేములవాడ రూరల్, ఆగస్టు-15 (జనంసాక్షి) : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలు, కార్యాలయాలలో సోమవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యావనరుల కేంద్రం నందు మండల విద్యాధికారి బన్నాజీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషదారనలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కట్ట రవీందర్, ఆనందం, సలాం, కోటేశ్వర్, శిరోమణి, శ్రీదేవి, జ్యోతి, జయలక్ష్మి, నవీన్, సిఆర్పిలు ఎల్లేష్, నగేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు




