Wednesday, 4 November 2026

*ఘనంగా హిందీ భాష దినోత్సవం*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (14):* మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏదుట్ల లో హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల హిందీ పండితుడు ఎన్ గోపాల్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా శాలువతో సన్మానించారు ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు మాట్లాడుతూ హిందీ భాష చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉందన్నారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వాతంత్ర సమరయోధులు హిందీ మాట్లాడడం ద్వారానే దేశానికి స్వాతంత్రాన్ని సాధించారని వారన్నారు హిందీ జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని అదేవిధంగా ప్రపంచ దేశాలలో హిందీ నేర్చుకున్న వ్యక్తుల కు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేంద్ర చారి, కురుమన్న, శ్రీనివాసులు, దామోదర్ రెడ్డి, సీనయ్య, మురళి, రాధా, శ్రీదేవి, మరియు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Attachments area