గుడిహత్నూర్ : మార్చ్, 30( జనం సాక్షి)శ్రీరామ నవమి వేడుకలను గురువారం మండల వ్యాప్తంగా ఘానంగా జరుపుకున్నారు గుడిహత్నూర్ శివాలయం, మన్నూర్, ఉమ్రీ(బి) పంచాయతీ లో ఉన్న రామ మందిరంలో శ్రీరాముడి జన్మదిన వేడుకలు నిర్వహించారు చేశారు హనుమాన్ దీక్ష పరులు మండల కేంద్రంలో హనుమాన్ జెండాలు పట్టుకొని మోటార్ సైకిలతో శోభాయాత్ర నిర్వహించారు జడ్పిటిసీ పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ దుష్టశక్తుల నాశనానికి ఐక్యత అవసరమన్నారు హైందవ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్, శివాలయ కమిటీ ఛైర్మన్ దరంపాల్ అగర్వాల్, కమిటీ సభ్యులు శ్రీ రాం, కేంద్రే లక్ష్మణ్, గిత్తే వామన్ పటేల్, హనుమాన్ దీక్ష పరులు సంజీవ్, నరేష్, గజానంద్, రాథోడ్ సచిన్, మేఘావత్ వైవేకానంద్,వీహెచ్ పి, భజరంగ్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు
ఘానంగా శ్రీ రామ నవమి వేడుకలు




