చంచల్‌గూడ(హైదరాబాద్): చంచల్‌గూడ జైల్లో ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన టెలిఫోన్ బూత్‌ను జైళ్లశాఖ డీఐజీ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో వారానికి రెండు సార్లు ఐదు నిముషాల పాటు మాట్లాడుకునేందుకు ఈ టెలిఫోన్ బూత్ ఉపయోగపడుతోందన్నారు. చంచల్‌గూడ జైల్ సూపరింటెండెంట్ సైదయ్య, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




