Tuesday, 3 November 2026

చంద్రబాబుపై పిటిషన్‌ వెనక్కి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్‌ శ్రవణ్‌కుమార్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. ఆధారాలు లేకుండా పిటిషన్లు వేస్తే విచారణకు స్వీకరించలేమన్న కోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ రాజకీయంగా వేసిన పిటిషన్‌లా ఉందని కోర్టు పేర్కొంది. రాజకీయాలు బయట చూసువాలని, కోర్టు సమయాన్ని వృధా చేయొద్దంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.