హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ దొంగలేనని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు బాబు, కేసీఆర్ రాష్ట్రాలను పంచుకున్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నేతలను ప్రలోభ పెట్టి తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంటే గవర్నర్, కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.




