హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టనున్న పాదయాత్ర పేరును పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఖరారు చేసింది. సమావేశంలో చర్చించిన అనంతరం ‘ పాదయాత్రకు వస్తున్నా మీకోసం’ అనే పేరును నిర్ణయించారు. అక్టోబరు 2న హిందూవురం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చంద్రబాబు పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతపురం జిల్లా రాప్తాడు. పెనుకొండ, గుత్తి మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలోనే దాదాపు 13 రోజులపాటు పాదయాత్ర కొనసాగుతుందని ఆపార్టీ నేతలు వెల్లడించారు.




