చంద్రబాబు ఫోర్త్‌ జెండర్‌

-కాలానికి తగ్గట్లుగా రంగులు మార్చుతాడు
– ఏపీ సీఎంపై వైసీపీ ఎంపీ విజయసాయి ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : చంద్రబాబు కాలానికి తగ్గట్లుగా రంగులు మార్చే వ్యక్తి అని, అతడు ఆడ, మగ, జెండర్‌ కాని మరోజీవి ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఫోర్త్‌ జెండర్‌ అని…ఆడ, మగ, నపుంసక కాని మరో జీవి అని వ్యాఖ్యానించారు. ఫోర్త్‌ జెండర్‌ అంటే ప్రకృతి కార్యంలో కూడా డ్యుయల్‌ రోల్‌ ప్లే చేసే వ్యక్తి అని, చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్‌ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మార్చుతారని ఎంపీ విమర్శించారు.
చంద్రబాబు ఓ వైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే మరోవైపు అవిశ్వాసం పెడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రఆరోపణలు చేశారు. వైసీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు దానివల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని అదే పని చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఏపీకి ప్రత్యేక ¬దా కోరుకుంటోందని తెలిపారు. ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలోనే చెప్పామని అన్నారు. టీడీపీ దొంగల పార్టీ అయినా బీజేపీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానికి మద్దతు ఇస్తామని, లోక్‌సభలో తమ
సభ్యులు లేనప్పటికీ సంఘీభావం తెలియజేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.