Wednesday, 4 November 2026

చంద్రబాబు సీఎం పదవికి రాజీమనా చేయాలి:బాల్క సుమన్

హైదరాబాద్:చంద్రబాబు సీఎం పదవికి రాజీమనా చేయాలని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. చంద్రబాబు వ్యవహారం.. దొంగనే దొంగ అన్నట్లుందని చెప్పారు. చంద్రబాబు.. అవినీతి సామ్రాట్ అని ఆరోపించారు. అవినీతి నేతలను ప్రశ్నిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు కేసులో వ్యవహారంలో ఇరుకున్న చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. టిసర్కార్ పై చంద్రబాబు దుర్మార్గంగా కుట్ర పన్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసును ఎసిబి సమగ్రంగా విచారణ జరపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *