-డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
హైదరాబాద్ సిటీ, జనంసాక్షి :
భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు.మంగళవారం కాకాగూడ కమ్యూనిటీ హల్ లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశంలో శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అంటరానితనం నిషేధించినప్పటికీ ఆచరణలో మాత్రం కుల,మత,లింగ బేధాలతో వివక్ష పాటించవద్దన్నారు.నగరంలో ఇండ్లు కిరాయి అడిగితే ఏమి కులం అని అడగకుండా ఆధునిక బాషలో మీరు మాంసాహారం తింటారా,క్రిస్టియన్ లా అని అడిగి పరోక్షంగా కులం అడుగుతు అవమానపర్చడం తగదన్నారు. కాకాగూడ లో అంగన్ వాడి కేంద్రం, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని స్దానిక మహిళలు అధికారులకు విన్నవించారు.డబుల్ బెడ్ రూమ్,రేషన్ కార్డులు,పించన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తిరుమలగిరి డిప్యూటీ తహసీల్దారు, కార్ఖనా మహిళ ఎస్.ఐ ,దళిత అభివృద్ధి, జిహెచ్ యంసి అధికారులు పాల్గొన్నారు.




