హరీష్ కుటుంబాన్ని ఆదుకుంటాం

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
శంకరపట్నం, జనం సాక్షి ,ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగం కోల్పోయిందని ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీష్ కుటుంబాన్ని ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శంకరపట్నం మండలం అంబాలపూర్ గ్రామంలో మంగళవారం అఖిలపక్ష నాయకులతో కలిసి మృతుని కుటుంబాన్ని రామగుండం ఎమ్మెల్యే పరామర్శించి, మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.మృతుని తల్లిదండ్రులు, భార్య రవళి నీ ఓదార్చారు. ఎరువుల కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేయడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఎమ్మెల్యేకు రవళి వివరించారు.ఉద్యోగం పోయి డబ్బులు పోయి చివరకు ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని దిక్కు లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆర్ ఎఫ్ సి ఎల్ లో రవళి కి ఉద్యోగం ఇచ్చే బాధ్యత తామాదే అన్నారు. పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. వసూళ్లకు తన బాధ్యత లేదని డబ్బులు తీసుకున్న వ్యక్తుల పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. డబ్బులు తీసుకునే వ్యక్తుల నుంచి ఇప్పించేందుకుకృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి 25000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందజేశారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,జిల్లా కార్యదర్శి వై యాకయ్య, అఖిల పక్ష నాయకుడు.తాండ్ర సదానందం, గుమ్మడి రాజయ్య,వైస్ ఎంపిపి కోటా రమేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.