చట్టబద్ధంగా చేసే సమ్మెను కార్మికులను ,విచ్చిన్నం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

జనం సాక్షి సైదాపూర్ సిఐటియు మండల కన్వీనర్ కదిరే రమేష్ మాట్లాడుతూ
గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె ఈనెల జూలై 6 వ తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు .కానీ సైదాపూర్ మండల్ లోని పంచాయతీ సెక్రెటరీ లు సమ్మెలోకి మీరు వెళితే మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తామని గ్రామపంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు . రాజ్యాంగబద్ధంగా ప్రతి కార్మికునికి సమ్మె చేసుకునే హక్కు ఉన్నది . కానీ పంచాయతీ సెక్రెటరీ లు సమ్మె చేసుకునే హక్కును కాల రాస్తూ వారు ఇష్టం వచ్చినట్టు కార్మికుల పట్ల భయాందోళనకు గురి చేస్తున్నారు అలాగే వారు సమ్మెకు అడ్డుపడుతున్నారు పంచాయతీ సెక్రెటరీల పై ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగా చంద్రయ్య సైదాపూర్ గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు మొలుగూరి ప్రేమ్ కుమార్ లింగయ్య సరోజన సంపత్ రాజేష్ బిక్షపతి ఎల్లయ్య రాజయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్న