చట్టాలను అందరూ గౌరవించాలి. – జూనియర్ సివిల్ జడ్జి ముకేష్.

బెల్లంపల్లి, ఆగష్టు 15, (జనంసాక్షి )
చట్టాలను అందరూ గౌరవించాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముకేష్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న జడ్జి ముకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు దేశం పట్ల గౌరవం, ప్రేమ, బాధ్యత కలిగి ఉండాలని, దేశ ఉన్నతికి తోడ్పడాలని, అందరూ చట్టాలను గౌరవించి ఆనందంగా ఉండాలని కోరారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

తాజావార్తలు