చదువుకి వయస్సుతో సంబంధం లేదు
జహీరాబాద్ జులై 27 (జనంసాక్షి)చదువుకి వయస్సుతో సంబంధం లేదని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా నడుచుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఫలితాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాములునేతను బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా,జహీరాబాద్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బరూర్. దత్తత్రి మాట్లాడుతూ చదువుకి పిల్లలు,పెద్దలు అనే తేడా ఏమీ లేదని,ప్రతి ఒక్కరూ చదవాలి అనే ఉధ్యేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఓపెన్ స్కూల్,ఓపెన్ ఇంటర్, డిగ్రీ అని దూరవిద్య కోర్సులు అందుబాటులోకి తెచ్చి చాలా మందికి మేలు జరిగిందని ఉద్యోగాలలో కూడా ప్రమోషన్స్ పొందారని అన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.