గద్వాల నడిగడ్డ, మార్చి 21 (జనం సాక్షి);
చలో విద్యుత్ సౌధ పోస్టర్ ను జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ ఎస్సీ కె.భాస్కర్ సోమవారం తమ చాంబర్ లో ఆవిష్కరించారు. జేఏసీ నాయకులు అయను కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం గురించి చర్చించారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధనకై చలో విద్యుత్ సౌద కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు 2022 వేతన
సవరణ, ఈపీఎఫ్ నుండి జి పి ఈ, ఆర్టిషన్ మొదలైన ఇతర సమస్యల సాధన కొరకు చలో కార్యక్రమం పెట్టుకున్నట్లు విద్యుత్ శాఖ జేఏసీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు.జేఏసీ నాయకులు చైర్మన్ రామకృష్ణ,కో చైర్మన్ అశోక్,కన్వీనర్ కే.శ్రీనివాస్, వెంకట్రాముడు,భాస్కర్,నర్సింహ,దేవేంద్ర,శ్రీధర్ ,మురళి,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
చలో విద్యుత్ సౌద పోస్టర్ విడుదల




