చలో హైదరాబాద్
గిరిజన,ఆదివాసీ సమ్మేళనం,బంజారా భవన్ ప్రారంభోత్సవం బహిరంగ సభకు వెళ్లే బస్సు యాత్ర ను ప్రారంభించిన -యంపిపి గుగులోత్ పద్మావతి రవి నాయక్
కురివి సెప్టెంబర్-17 (జనం సాక్షి న్యూస్)
తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ ఆదేశాల మేరకు శనివారం కురవి మండల కేంద్రము నుండి 22 బస్సు లలో దాదాపు 900 మంది హైదరాబాద్ కి బయలు దేరు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎంపీపీ గూగులోత్ పద్మావతి రవి నాయక్.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,డిప్యూటీ సీఈవో నర్మదా,
తాసిల్దార్ ఇమ్మాన్యువేల్, ఎంపీడీవో సరస్వతి, ఏపిఎం కిరణ్ , ఎస్సై రాము నాయక్ ,ఏపీఓ యాకంబరం,ఎంపీఓ పద్మా,సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, గిరిజన ఉపాద్యాయులు, అన్ని శాఖల గిరిజన ఉద్యోగులు,అన్ని గ్రామాల ఐకెపి అధికారులు, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు,పిఆర్ అధికారులు, ఎంపీడీఓ,ఎమ్మార్వో ఆఫీసు అధికారులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.